ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ బలంగా ఉంది… ఇదే సమయంలో బిజెపి రాష్ట్రంలో బలపడాలని కూడా చూస్తుంది… ఈ తరుణంలో వైసీపీని టార్గెట్ చెయ్యాలని ఆ పార్టీ చూస్తుంది. అవును వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం తర్వాత ఇదే విషయం స్పష్టంగా అర్ధమైంది. కేంద్ర మంత్రులు వైసీపీ ఎంపీలతో మాట్లాడటం మొదలు ప్రతీ ఒక్కటి కూడా వైసీపీ అధినేత జగన్ కి చికాకు పెట్టాయి. ఎంపీలు ఢిల్లీలో ఉన్నన్ని రోజులు కూడా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి చాలా అప్రమత్తంగా వ్యవహరించారు.
ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను బిజెపి టార్గెట్ చేసింది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. రాజకీయంగా బలపడాలని భావిస్తున్న బిజెపి… ఎమ్మెల్యేలను ఆహ్వానించడం ద్వారా విపక్ష హోదాలో ఉండాలని భావిస్తుంది. దీనికి జగన్ ఆదిలోనే అడ్డుకట్ట వేసినట్టు సమాచారం. రఘు రామ కృష్ణం రాజు వ్యవహారం తర్వాత బిజెపి విషయంలో అప్రమత్తంగా ఉంటూ వస్తున్న ముఖ్యమంత్రి… ఎమ్మెల్యేలను పిలిచి నేరుగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం… ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు…?
హైదరాబాద్, బెంగలూరు, చెన్నై లో ఉన్న వ్యాపారాలు ఏంటి…? బిజెపి నేతలతో ఎవరికి పరిచయాలు ఉన్నాయి…? అనే విషయాలు జగన్ ఆరా తీసారు. ఎమ్మెల్యేల వ్యాపార భాగస్వాములు ఎవరు అనే దాని మీద కూడా జగన్ ఆరా తీసినట్టు సమాచారం. ఎక్కడికి అయినా వెళ్ళినా సరే తనకు సమాచారం ఉండాలని, లేదా విజయసాయి, పెద్ది రెడ్డిలో ఒకరికి చెప్పాలని స్పష్టంగా చెప్పారట. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మాత్రం సస్పెండ్ చేసేస్తానని, పార్టీ సభ్యత్వం కూడా రద్దు అవుతుందని, అప్రమత్తంగా ఉండటంతో పాటు, ఎవరైనా మీతో మాట్లాడితే తనకు సమాచారం ఇవ్వాలని చెప్పారట జగన్.