VD 14: విజయ్ దేవరకొండ అదిరిపోయే ప్రకటన చేశాడు. ఇవాళ తన బర్త్డే ఉన్న నేపథ్యంలో కొత్త సినిమాలు ప్రకటించాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 అనౌన్స్ అయ్యింది. ఇవాళ విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
వీడీ 14 అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.