తెలంగాణలో సంచలన సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితులపై సంచనల విషయాలు బయటికి వస్తున్నాయి. తెలంగాణ పోలీసులు దిశ కేసుతో పాటు ఇప్పుడు కొత్తగా ఐదు హైవేలపై ఇలాగే జరిగిన కేసులను చేధించే క్రమంలో అసలు విషయాలు బయటికి వస్తుండటంతో విస్తుపోతున్నారు. ఈ హైవేలపై దిశ సంఘటన మాదిరిగానే 15 అత్యాచారం, హత్య కేసులు నమోదు అయ్యాయి. వీటిలో కూడా దిశ నిందితులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహాబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, కర్నాటక, హైదరాబాద్ హైవేలపై ఇలాంటి కేసులు నమోదు కాగా వీటిలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు.
దిశ కేసులో నిందితులైన ఆరీఫ్ అలీ, చెన్నకేశవులుపై ఇప్పటికే మరో 9 హత్య కేసులు నమోదు అయ్యాయని పోలీసులు అంటున్నారు. అయితే దిశ కేసులో భాగంగా ఈ నలుగురి నిందితుల డీఎన్ ఏను సేకరించారు పోలీసులు. ఈ హైవేలపై జరిగిన కేసులపై ఆరా తీస్తున్న క్రమంలో ఈ నలుగురి నిందితులు డి ఎన్ ఏలు సరిపోతున్నాయనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఈ కేసుల్లో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఈ బృందాలను సైబరాబాద్ కమీషనర్ విశ్వనాధ్ చెన్నప్ప సజ్జనార్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మానటరింగ్ చేస్తున్నారని సమాచారం. నిందితుల డీఎన్ ఏ తో మిస్టరీని చేధించేందుకుఇ తెలంగాణ పోలీసులు సమాయత్తం అవుతున్నారు. హైవే వెంట హత్యలు చేసి కాల్చివేసిన సంఘటలకు ఈ నిందితులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే ఆరా తీస్తున్నారు. దిశ కేసులో నిందితులపై చార్జీషీటు దాఖాలు చేసే సమయం లోపునే ఈ కేసులను చేధించాలనే దృడ సంకల్పంతో తెలంగాణ పోలీసులు ఉన్నారు.
అందుకు నాలుగు బృందాలతో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ నాలుగు బృందాలు రంగంలోకి దిగి హత్యలు జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఈ కేసుల్లో నిందితులను గుర్తించే క్రమంలో పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. హైవేలపై జరిగిన దారుణాలు.. హత్యలు.. దిశ కేసులతో తేలిపోనున్నాయన్న మాట. హైవేల వెంట జరిగిన ఈ హత్యలకు దిశ కేసు దిశ చూపబోతుంది.