కేజ్రీవాల్ కి బెయిల్…సుప్రీం కోర్టు విధించిన షరతులు..

-

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ కు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది. జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తప్పనిసరిగా సరెండర్ కావాలని ఆదేశం ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌ కి కొన్ని షరతులు విధించింది.

 

* రూ.50,000 పూచీకత్తు చెల్లించాలి.

* ఢిల్లీ CM ఆఫీస్, సెక్రటేరియటకు వెళ్లకూడదు.

* ప్రస్తుత కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు.

* ఈ కేసుకు సంబంధించి సాక్షులతో మాట్లాడకూడదు.

* గవర్నర్ క్లియరెన్స్ కోసం తప్ప అధికారిక ఫైళ్లపై సంతకం చేయరాదు.

కాగా, లోక్‌సభ ఎన్నిక ల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలుచేయగా… విచారణ జరిపిన ధర్మాసనం కేజ్రీవాల్ కు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news