రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం చరమాంకానికి చేరుకుంది. ఇప్పటికే పలు ప్రధాన పార్టీల అధినేతలు వరుస బహిరంగ సభలు, రోడ్డు షోలతో బిజీగా ఉన్నారు. ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు రేపు సాయంత్రం 6 వరకు మాత్రమే ఆయా పార్టీలు ప్రచారం చేసేందుకు అవకాశం ఉంది. క్షణం ఆలస్యమైనా వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు.ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆయా పార్టీలకు కీలక సూచన చేశారు.
వైన్ షాపులు సైతం రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మూసివేయాలి.పోలింగ్ రోజున అనుమతి ఇచ్చిన వాహనాలను మాత్రమే అభ్యర్థులు ఉపయోగించాలి.పొలిటికల్ పార్టీలు పెట్టే అవగాహన బూత్ లు 200 మీటర్ల బయటే ఉండాలి.పోలింగ్ బూత్ లోకి అభ్యర్థి మాత్రమే అనుమతి..గన్ మన్లకు అనుమతి లేదు.చిన్న పిల్లలను తీసుకొని ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రావొద్దు.. అనుమతి లేదు అని తెలిపారు.