పేదల ఐదేళ్ల భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. మరో 3 రోజుల్లో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కడప సభలో మాట్లాడుతూ.. ‘ఈ 59 నెలలు లంచాలు, వివక్ష లేకుండా పాలన సాగించాం. మహిళల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం అని వెల్లడించారు. జగన్కు ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపే’ అని అన్నారు.
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న బీజేపీతో ఎలా జత కట్టారని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ‘ముస్లింలకు మత ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అవి కొనసాగి తీరాల్సిందే. ఇది మీ వైఎస్సార్ బిడ్డ మాట. NRC, CAA అంశాల్లోనూ మైనార్టీలకు అండగా ఉంటాం. 4 MLC, 7 MLA సీట్లు ఆ వర్గానికి ఇచ్చాం’ అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.