ఇప్పటివరకు కాంగ్రెస్సే 80 సార్లు రాజ్యాంగంలో సవరణలు చేసింది :నితిన్ గడ్కరీ

-

బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 80 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

శుక్రవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ తప్పుడు ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు పేదలుగా మిగిలిపోయారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలను మెప్పించడంలో ప్రతిపక్షం విఫలమైంది. అందుకే వారు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు అని మండిపడ్డారు.

బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చలేమని, సవరణలు మాత్రమే చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది అని తెలిపారు. పేదలందరికీ ప్రయోజనాలు అందే వరకు తమ పనిని ఆపేదిలేదు అని స్పష్టం చేశారు.మేము 10 ఏళ్ల నుంచే పనిచేస్తున్నాం. కాంగ్రెస్ ఆరు దశాబ్దాలు అధికారంలో ఉన్న ఏమీ చేయలేదు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .

Read more RELATED
Recommended to you

Latest news