కాంగ్రెస్ కి , బీఆర్ఎస్ కి ఓటు వేస్తే జీరో వ్యాల్యూ : ఈటెల రాజేందర్

-

ఎల్బి స్టేడియంలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ…బీసీ కమిషన్కు చట్టబద్ధత ఇచ్చింది మోదీనే అని తెలిపారు. మీ ముఖానికి మీ హయాంలో ఓబీసీ ఎస్సీ, ఎస్టీ మంత్రుల సంఖ్య ఎంత అని చెప్పే దమ్ము మీకుందా ? అని ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు.మోడీ గారి నాయకత్వంలో 75 మంది మంత్రులు ఉంటే 27 మంది ఓబీసీలు. 12 ఎస్సీలు 8 ఎస్టీలు ఐదు మంది మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత మోడీ గారిది.మహిళను ఆర్థిక మంత్రిగా చేసిన చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది అని ప్రశంసల జల్లు కురిపించారు.

రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే.. ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తావు చెప్పాలి అని ప్రశ్నించారు. 2014లో, 2018లో మీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు ఈసారి కూడా ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో చూసుకో.బిజెపి ఎంపీలు గెలిస్తే నిధులు రావు అని మాట్లాడుతున్నారు మీకు జ్ఞానం ఉందా.. పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. జాతీయ రహదారులు, హైదరాబాద్ అభివృద్ధి, రైల్వేస్టేషన్లు , రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం.. తెలంగాణకు ఎక్కడ చిన్నచూపు చూపలేదు. గ్రామాల అభివృద్ధిలోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంది.. దానితోనే దేశాభివృద్ధి జరుగుతుందని భావించిన నాయకుడు నరేంద్ర మోడీ.. మీలాగా కుసంస్కారి కాదు. కాంగ్రెస్ లాంటి నీచ సంస్కృతి బిజెపికి లేదు.తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే.. నిధులు రావాలంటే.. బిజెపిని ఆశీర్వదించండి.కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి ఓటు వేస్తే జీరో వ్యాల్యూ.. ఉపయోగం లేదు. 75 రోజులుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న ఎక్కడికి పోయినా బిడ్డ మోదీ గారే మళ్లీ ప్రధానమంత్రి కావాలంటున్నారు.దేశం సురక్షితంగా, సుభిక్షంగా, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం గౌరవం పెరగాలంటే మోడీ గారే రావాలని అంటున్నారు.370 ఆర్టికల్ రద్దయింది. రామ మందిరం నిర్మాణం జరిగింది. రాబోయే కాలంలో పేదరిక నిర్మూలన ఎజెండాగా.. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్, జాతీయ రహదారులు , రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావాలంటే బిజెపికి ఓటెయ్యండి.మల్కాజ్గిరి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం కావాలన్నా హామీ ఇవ్వండి ప్రతి ఒక్కటి చేస్తామని భరోసా ఇచ్చారు.ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు.. ట్రైనింగ్ సెంటర్లు పెట్టేందుకు, ఇన్ఫ్రా డెవలప్మెంట్ నిధులు ఇవ్వగలిగే నాయకుడు నరేంద్ర మోడీ కాబట్టి యావత్ ప్రజానికం మద్దతు తెలపాలి అని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news