IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో బిగ్ ఫైట్ జరగనుంది. ఇవాళ ఐపిఎల్ 2024లో భాగంగా కోల్కత్తా తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ మ్యాచులో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ను అంపైర్లు 16 ఓవర్లకు కుదించారు.

ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగనుంది.కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో టాప్ గా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి ఎనిమిది మ్యాచ్లో గెలిచింది. అటు ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లు వాడి కేవలం నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : ఇషాన్ , నేహల్ వధేరా, నమన్ ధీర్, సూర్య కుమార్, తిలక్వర్మ, పాండ్య (C), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, చావ్లా, బుమ్రా, నువాన్ తుషార.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాల్ట్, నరైన్, నితీశ్ రాణా, శ్రేయస్, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమన్దాప్, స్టార్క్, చక్రవర్తి, హర్షిత్.

Read more RELATED
Recommended to you

Latest news