Karnataka : HD రేవణ్ణకు బెయిల్

-

సంచలనం సృష్టిస్తున్న సెక్స్ టేప్ స్కాండల్ కేసులో అరెస్టైన కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణకు కోర్టు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మే 4 న సిట్ బృందం ఆయన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రేవణ్ణ కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిని లైంగికంగా వేధించారని ఆ మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై కిడ్నాప్ కేసు నమోదైంది.

ఇదిలా ఉంటే… మహిళ కిడ్నాప్ కేసులో అరెస్టైన కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్ఎ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన బెంగళూరు కోర్టు ష్యూరిటీ కింద రూ.5 లక్షల బాండ్ సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులకు సహకరించాలని తీర్పులో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news