అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆత్రేయపురం బూత్ లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణతో వివాదం చోటు చేసుకుంది. తన తమ్ముడి పై దాడి చేసిన వారు ఈ రోజు ఉదయం 9 గంటలకు రావిచెట్టు సెంటర్ కు రావాలంటూ టిడిపి నేతలకు వైసీపీ నేత వేగేసిన రాజు మిల్లు గోపి సవాల్ విసిరారు.
దీంతో వైసీపీ నేత సవాల్ ను స్వీకరించి రావి చెట్టు వద్దకు బయలుదేరారు తెలుగుదేశం నేతలు. అదేసమయంలో అటుగా వేగేశిన రాజు వచ్చారు. దీంతో రాజుపై దాడి చేశారు టిడిపి వర్గీయులు. ఈ దాడి సమయంలో అడ్డుకొనేందుకు వెళ్ళిన ఎఐకి గాయాలు అయ్యాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు…
గ్రామంలో భద్రత కట్టుదిట్టం చేశారు.