ఏపీలో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ అంతర్భాగ కర్నాటక & పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నెలకొంది. ఆగ్నేయ అరేబియా సముద్రం & ఆనుకుని ఉన్న కేరళ నుండి కర్ణాటక మీదుగా మరఠ్వాడా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి తో విలీనం అయిన అవర్తనం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు 19 మే, 2024 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు మరియు నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ లేదా నైరుతి గాలులు వీస్తున్నాయి..రాబోయే ముడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.