హైదరాబాద్‌ జూలో తెల్ల పులి మృత్యువాత

-

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో అభిమన్యు అనే తెల్ల పులి మృతి చెందింది. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెల్ల పులి చికిత్స పొందుతూ చనిపోయింది. తెల్ల పులి వయస్సు 9 సంవత్సరాలు కాగా నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోనే జన్మించింది. గతేడాది నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న తెల్ల పులి.. మంగళవారం తుదిశ్వాస విడిచింది. హైదరాబాద్‌లోని వీబీఆర్ఐ, సీవీఎస్సీ వెటర్నరీ నిపుణుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించి, పులికి అంత్యక్రియలు నిర్వహించారు. పులి మృతిపట్ల జూ అధికారులు, కార్మికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

తొమ్మిదేళ్ల వయసు ఉన్న  తెల్లపులి అభిమన్యుకు గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్‌’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా ఉన్న అభిమన్యు ఈ నెల 12న అభిమన్యు ఆహారం తీసుకోలేదు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో మంగళవారం మృత్యువాత పడింది. పోస్టుమార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలిందని జూ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జూలో మొత్తం పులులు 18 ఉన్నాయి. అందులో తెల్లపులులు 8 ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news