టపాసులతో దాడి చేసుకున్న టీడీపీ-వైసీపీ శ్రేణులు

-

టపాసులతో దాడి చేసుకున్నారు టీడీపీ-వైసీపీ శ్రేణులు. తాడిపత్రిలో టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. స్థానిక కాలేజీ గ్రౌండ్కు చేరుకున్న ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టడానికి విఫలయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గకుండా వైసీపీ-టీడీపీ శ్రేణులు టపాసులు కాలుస్తూ పరస్పరం దాడులకు దిగాయి.

TDP-YCP ranks attacked with tapas

దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. రామాపురంకు చెందిన ఓ వైసీపీ నేత, అతని అనుచరులు సుత్తి, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా.. గన్ మెన్ బాగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పులివర్తి నాని గన్ మేన్ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులు జరపగా.. నిందితులు అక్కడి నుంచి వెళ్లపోయారు.

 

Read more RELATED
Recommended to you

Latest news