సన్న వడ్లు వేస్తేనే రూ. 500 బోనస్ ఇస్తాం !

-

సన్న వడ్లు వేస్తేనే 500 రూపాయల బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వ్యవసాయ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలో వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గాలికొదిలేసింది.

Chief Minister Revanth Reddy condoles the death of Vinay Veer, editor of Hindi Milap, a prominent journalist

ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని సరిగా అమలు చేయడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ హామీలలో 500 రూపాయల బోనస్ ఒకటి. క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రచారంలో చెప్పింది. ఎన్నికల హామీలు కూడా వెల్లడించింది. కానీ గద్దెనెక్కిన తర్వాత… ఆ హామీని గాలికి వదిలేసింది కాంగ్రెస్. ఇక ఇప్పుడు సన్న వడ్లు వేస్తేనే 500 రూపాయల బోనస్ ఇస్తామని… కొత్త లిటుకు పెడుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరి వేస్తే ఊరే అన్నట్లుగా… ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news