ఘోర విషాదం.. ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

-

గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు నదికి వెళ్లిన ఓ కుటుంబంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. వేసవిలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే వారు రెస్క్యూ టీమ్తో అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రమాదం చోటుచేసుకుని 24 గంటలు గడిచినా వారి ఆచూకీ లభించలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్లోని నర్మదా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరందరూ వేసవి నేపథ్యంలో సరదాగా ఈత కొట్టేందుకు ఇక్కడికి వచ్చారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు న్నారు. నీట మునిగిన వారి కోసం నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఎన్ డీఆర్ ఎఫ్), వడోదర అగ్నిమాపక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. రోజు గడిచినా ఇంకా వారి ఆచూకీ దొరకడం లేదు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.

Read more RELATED
Recommended to you

Latest news