తాడిపత్రిలో 144 సెక్షన్‌.. వేర్వేరు ప్రాంతాలకు జేసీ ప్రభాకర్‌, పెద్దారెడ్డి

-

ఏపీ ఎన్నికలు రణరంగంగా మారిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ రోజున మొదలైన గొడవలు, ఘర్షణలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం జిల్లాలు రణరంగంలా మారాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్లు విధించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు.

లాఠీఛార్జిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుడు కిరణ్‌కుమార్‌, మరో ఇద్దరికి గాయాలవ్వగా.. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. ఎలాంటి గొడవలు జరగకుండా జేసీ ప్రభాకర్‌ రెడ్డి, పెద్దారెడ్డిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఇరు పార్టీల కార్యకర్తలు తాడిపత్రి పట్టణంలోకి రాకుండా పోలీసులు దారులన్నీ మూసివేశారు. 144 సెక్షన్‌ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news