మీరు చెప్పే ప్రేమను పెంచడం అంటే ఇదేనా.. రాహుల్‌జీ?: కేటీఆర్‌

-

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పార్టీ నేతలు, ఇండ్లపై కాంగ్రెస్ నేతల దాడులపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ పై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

స్థానిక కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. ఈ దాడులు, దుర్భాషాలాడడంలో పోలీసులు కూడా భాగస్వామ్యం కావడం సిగ్గుచేటని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన గూండాలు, ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.

అంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ‘నిన్న అచ్చంపేట పట్టణంలో కాంగ్రేసు గూండాల దాడిలో స్థానిక పోలీసుల ‘ప్రేక్షక పాత్ర’ చూడండి డీజీపీ గారు అంటూ ఓ వీడియోను ఆ పోస్టులో షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news