ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేష్ అన్న నీతి ఆయోగ్.. ఈ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రం అని.. భూములపై రైతులకు సర్వహక్కులు లభిస్తాయని పేర్కొంది.
పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని.. ఈ చట్టంతో భూ పరిపాలన మరింత సులువవుతుందన్నది నీతి ఆయోగ్.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. సాక్షి డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్ వెంకటేష్ అడిగిన ఆర్టీఐ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం పంపింది. ఓటమి భయంతో చంద్రబాబు గ్యాంగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్ పై, ఏపీ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై నీచమైన ప్రచారానికి ఒడిగట్టినట్టు సమాచారం.