లాలూ పాక్ కు వెళ్లిపోయి అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు : హిమంత బిస్వ శర్మ

-

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వాఖ్యాలపై బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

లాలూ పాకిస్థాన్‌కు వెళ్లిపోయి అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు.సివన్ జిల్లా రఘనాథ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మతం ప్రాతిపదికపై రిజర్వేషన్లు ఇవ్వరాదని అన్నారు.ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని లాలు చెబుతున్నారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి హిందువులు అర్హులు కారా? అని ప్రశ్నించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ మనకు రాజ్యాంగం ప్రసాదించారు. రాజ్యాంగంలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలు రిజర్వేషన్లు పొందవచ్చని చాలా స్పష్టంగా ఉంది. మతం పేరుతో రిజర్వేషన్ల ప్రస్తావనే లేదు. నేను లాలూ యాదవ్‌కు ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మీకు పాకిస్థాన్ టిక్కెట్లు కొనిస్తాను. అక్కడి వెళ్లి రిజర్వేషన్లు ఇచ్చుకోండి. భారత్ లో అయితే మాత్రం ఇది ఎప్పటికీ సాధ్యం కాదు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news