జ‌గ‌న్ ఎఫెక్ట్‌తో.. రెండో రోజు ప్రారంభ‌మైన అమ‌రావ‌తి ఫైట్‌

-

రాజధానిపై ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనపై విపక్షాలు, రాజధాని రైతులు భగ్గుమంటున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మూడు రాజధానుల ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏపీ రాజధాని అమరావతిలో మొదలైన ఆందోళనలు రెండో రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు రోడ్డుపై బైఠాయించిన రైతులు ముఖ్యమంత్రి జగన్ ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ‘3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు’అనే పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చే రేపొద్దంటూ పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. కాగా, ఈ మధ్యాహ్నం తుళ్లూరులోని ప్రధాన రహదారిపై వంటావార్పు చేపట్టనున్నట్టు జేఏసీ సభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news