బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ కు రూ.75 రేవంత్ వసూలు చేస్తున్నాడని ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. నల్లగొండలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బిల్డింగ్ పర్మిషన్ కి SFT కి 75 రూపాయలు రేవంత్ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయలేరు…ఏదిపడితే అది చెప్పి తప్పించుకుంట అంటే ప్రజలు నీ భరతం పడతారని హెచ్చరించారు. అతి తక్కువ కాలంలో ప్రజలచేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని… కమీషన్ల దుకాణాలు ఓపెన్ చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వపరమైన ఆదాయాన్ని పెంచేదానికంటే వాళ్ళ ఆదాయం ఎలా పెంచుకోవాలో ఆలోచన చేస్తున్నారని… హైదరాబాద్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఎస్.ఎఫ్.టి కి 75 రూపాయలు వసూలు చేయాలని ఫిక్స్ అయిందని..రైట్ రాయల్ ట్యాక్స్ లెక్క.. ముగ్గురు మనుషులని పెట్టి వారు చెప్తేనే పర్మిషన్ ఇచ్చేటట్లుగా.. ఆ ముగ్గురికి డబ్బులు చెల్లించాలని నిర్ణయం జరిగినట్టు తెలుస్తుందన్నారు. పెరుగుట విరుగుట కొరకైనట్లు కేసీఆర్ కూడా ఇలానే చేసి ఖతమయ్యారు. కెసిఆర్ జుట్టులో నుంచి పుట్టిన అంటే ఏదో అనుకున్నాం.. రేవంత్ రెడ్డి ఇదేనా నువ్వు చేసే పని….పోయేకాలం ఇలానే ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేసింది రేవంత్ రెడ్డి నేన్నారు.