Hyderabad: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లతో శ్రీ ప్రియాంక సంస్థ భారీ మోసం

-

అధిక వడ్డీ ఆశ చూపెట్టి…బిచానా ఎత్తేసింది శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్. ఏకంగా రెండు వందల కోట్లు దండుకొని పారిపోయారు శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ బృందం. ఆ డబ్బులతో అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల పరారీ అయింది. తన భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు డిపాజిట్ల సేకరణ చేశారు.

Sri Priyanka Enterprises Fraud At Abids

బ్యాంక్ కు వచ్చి డిపాజిట్ చేయాలనుకున్న వినియోగదారులను ఆకర్షించి పెట్టుబడి పెట్టేలా చేసింది. బ్యాంక్ సమీపంలో తన భర్తతో మరో ఆఫీస్ ఓపెన్ చేయించి డిపాజిట్లు చేయించింది నిమ్మగడ్డ వాణి బాల. అపెక్స్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణి బాల ఈ కేసులో అసలు సూత్రధారి. ఇక తమకు న్యాయం చేయాలని బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సీసీస్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.

డిపాజిట్ ల రూపంలో తీసుకొని అధిక వడ్డీలు ఇస్తామని నమ్మబలికి 517 మంది వద్ద డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బు మొత్తం రెండు వందల కోట్లు అయిందట. ఇక ఈ కేసులో డిస్కబ్ ఉన్నతాధికారి నిమ్మగడ్డ వాణి బాల సస్పెండ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news