చంద్రగిరి, సత్తెనపల్లిల్లో రీపోలింగ్ పై వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. చంద్రగిరి, సత్తెనపల్లిల్లో రీపోలింగ్ పై ఏపీ హై కోర్టు.. కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి అంబటి పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ దాఖలు చేశారు.
అయితే.. ఈ పిటీషన్ ను పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది హైకోర్టు. చంద్రగిరిలో రీపోలింగ్ జరపాలంటూ మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు.
ఇక అటు వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో జూన్ 5వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.