ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి చేశారు : బండి సంజయ్ కుమార్

-

తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి,ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌తో పాటు పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశామని కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రతిపక్షాలపై సైబర్ దాడి చేశారని మండిపడ్డారు .ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టే దీనికి నిదర్శనమని ,దేశ భద్రతకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్‌ను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న కేసీఆర్ ఏ పదవికి అర్హుడు కాదని విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్ట్ చేసి విచారించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news