న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావం’ అనే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీడపీడల లేని కాలుష్య రహిత సాగును ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందన్నారు.
ఎలాంటి రసాయనాలు, ఎరువులను వాడకుండా రైతులు సాగు చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే ఈ తరహా సేద్యం లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై చంద్రబాబు ఆవిష్కరించారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు.