పబ్లిక్ టాయిలెట్స్ లో శానిటరీ ప్యాడ్స్.. ధర కేవలం 5 రూపాయలే!

-

శానిటరీ ప్యాడ్స్ గురించి గత కొన్ని రోజులుగా దేశంలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. శానిటరీ ప్యాడ్స్ ప్రాధాన్యత, ఎక్కువ ధర పెట్టి కొనలేక పేదలు పడుతున్న అవస్థలపై బాలీవుడ్ లో ఓ సినిమా కూడా వచ్చింది. ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్ ధరలు తగ్గించాలని .. పేద మహిళలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని పలు సంఘాలు డిమాండ్ కూడా చేస్తున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని పబ్లిక్ టాయిలెట్స్ లో శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మిషన్లును ఏర్పాటు చేశారు.

సౌత్ ఢిల్లీలో ఉన్న 14 లేడీస్ టాయిలెట్లలో ఈ శానిటరీ ప్యాడ్స్ మిషిన్లను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సబ్సిడీపై కేవలం 5 రూపాయలకే శానిటరీ ప్యాడ్స్ ను ఇక్కడ పొందొచ్చు. అవే టాయిలెట్స్ లో ఇంకినేటర్ మిషన్లను కూడా అమర్చారు. ఉపయోగించిన ప్యాడ్స్ ను అందులో వేయొచ్చు. వాటితో పాటు కొన్ని పింక్ టాయిలెట్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పింక్ టాయిలెట్లలో మహిళలు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు.. చిన్నారులకు పాలు పట్టొచ్చు.. డ్రెస్సు కూడా మార్చుకునే విధంగా సౌకర్యాలు కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news