దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు షాక్

-

దిల్లీ లిక్కర్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరోవారం పొడిగించాలని కేజ్రీవాల్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దిగువ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు ఉందని పేర్కొంది. అందువల్ల ఆయన అభ్యర్థనను స్వీకరించలేమని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకుగాను ఈనెల 10వ తేదీన 21 రోజులపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్‌ రెండో తేదీన లొంగిపోవాలని కేజ్రీవాల్‌కు సూచించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న కేజ్రీవాల్‌ జూన్‌ 2వ తేదీన జైలులో లొంగిపోవాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news