నీటిపారుదల శాఖలో భారీ ఎత్తున ఇంజనీర్ల బదిలీలు

-

తెలంగాణ నీటి పారుదల శాఖలో భారీ ఎత్తున ఇంజినీర్ల బదిలీకి రంగం సిద్ధం అవుతోంది. ఒకే ప్రదేశంలో ఐదేళ్ల నుంచి పని చేస్తున్న ఇంజినీర్లను బదిలీ చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి వివరాలు ఇవ్వాలని పరిపాలనా ఈఎన్సీని  నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారందరినీ బదిలీ చేయాలని ప్రాధాన్యకర పోస్టుల్లో ఉన్నవారిని అప్రాధాన్య పోస్టులకు మార్చాలని తెలిపారు.

ఇప్పటి వరకు అంతగా ప్రాధాన్యంలో లేని పోస్టింగుల్లో ఉన్న వారిని కీలక పోస్టులకు బదిలీ చేయాలని రాహుల్ బొజ్జా సూచించారు. ఆయా ఇంజినీర్లపై ఏవైనా క్రమశిక్షణా పరమైన కేసులు, రిమార్కులు ఉంటే వాటిని కూడా పేర్కొనాలని తెలిపారు. ఈ నెలాఖరు వరకు కటాఫ్ గా తీసుకొని ఐదేళ్లు పూర్తయిన వారందరి వివరాలను నిర్ణీత నమూనాలో మంగళవారంలోపు ఇవ్వాలని ఈఎన్సీని రాహుల్ బొజ్జా ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news