ట్రంప్ కు బిగ్ షాక్.. 34కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. హష్ మనీ పేమెంట్స్‌ సహా 34 కేసుల్లో దోషిగా తేల్చింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తప్పుడు వ్యాపార రికార్డులను చూపెట్టారని పేర్కొంది. దీంతో అమెరికా చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.

ట్రంప్‌ ఎదుర్కొన్న మొత్తం 34 కేసుల్లో దోషిగా నిర్ధరించే ముందు రెండు రోజుల పాటు సుమారు 9.5 గంటలు న్యాయ నిపుణులు చర్చించారు. తీర్పు వెలువరించే ముందు ట్రంప్ ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపించలేదని అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ట్రంప్ విరోధులు మాత్రం ఆనందంతో కేరింతలు కొట్టారని.. కోర్టు బయట సంబరాలు చేసుకున్నారని వెల్లడించాయి. ట్రంప్‌ను దోషిగా తేల్చినా ఆయనకు ఎప్పుడు శిక్ష విధిస్తారనే అంశాన్ని కోర్టు ప్రస్తావించలేదు. ఒకవేళ ట్రంప్ జైలుకు వెళ్తే నవంబర్‌లో ఆయనకు ఓటువేసే హక్కు ఉండదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news