గత పదేళ్లలో కేసీఆర్ పోలీసు వ్యవస్థను తన జేబు సంస్థలా వాడుకున్నారు : బీజేపీ నేత

-

గత పది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పోలీసు వ్యవస్థను తన జేబు సంస్థలా వాడుకున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు.ఇవాళ ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ..టెలిగ్రాఫ్ యాక్టుకు భిన్నంగా విదేశాల నుంచి పరిక రాలు తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని, ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమేనని మండిపడ్డారు.3 ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎలక్షన్ల టైంలో బీజేపీని కట్టడి చేసేందుకు, ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు కేసీఆర్ పోలీసు వ్యవస్థను వినియోగించుకున్నారని విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన అధికారుల కన్ఫెషన్ స్టేట్ మెంట్లు చూస్తుంటే ది మ్మ తిరిగే నిజాలు బయటికి వస్తున్నాయని ,విధిలేని పరిస్థితిలో పెద్దాయని చెబితేనే చేశామని నేరాన్ని అంగీకరించారని అన్నారు.లిక్కర్ స్కాం కేసు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ఫోన్లు ట్యాపింగ్ చేశారని,ఈ వ్యవహా రంలో కీలక సూత్రధారి అయిన ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news