టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీచేయనుంది టీడీపీ. నిన్న హైదరాబాద్లో టీటీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను సూచించారు.
అటు విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. గతంలో కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెరగడంతో వైసీపీకి ఓటమి భయం పుట్టుకుందన్నారు. పోలింగ్ సరళి చూస్తే వైసీపీకి 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తున్నట్లు చంద్రబాబు ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు.