ఏపీ ఎన్నికల ఫలితాలపై డైరెక్టర్ రవిబాబు జోస్యం..!

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 04న విడుదల కానున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై పలువురు జోస్యం చెబుతున్నారు. ముఖ్యంగా కూటమి నేతలు కూటమి విజయం సాధిస్తుందని చెబుతుండగా.. వైసీపీ నేతలు కూడా వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఎవ్వరికీ వారు ధీమాగా ఉన్నారు.

తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబును మరోసారి చూడబోతున్నామని వెల్లడించారు. జూన్ 04న విడుదల కాబోతున్న ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కూటమికి 150 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 75 ఏళ్ల వయస్సులో ఉన్న చంద్రబాబు 16 నుంచి 18 గంటల వరకు ప్రజల కోసం పని చేయగలిగే సత్తా ఉందన్నారు. ఈ ఎన్నికలతో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ రవిబాబు. గతంలో రవిబాబు టీడీపీలో పని చేశారని.. ఆ అభిమానంతో ఇలా కామెంట్స్ చేస్తున్నారని కొందరూ కొట్టి పారేస్తున్నారు. జూన్ 04న విడుదలయ్యే ఎన్నికల ఫలితాల్లో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news