పల్నాడులో నేటి నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు వ్యాపారాలు బంద్ కానున్నాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. కౌంటింగ్ డే రోజు నరసరావుపేటను, అష్టదిగ్బంధం చేయనున్నారు పోలీసులు. మూడు వేల మంది పోలీసులతో పల్నాడులో భారీ భద్రత ఏర్పాటు చేశారు. లాడ్జిలు, కళ్యాణ మండపాలను సైతం మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
కౌంటింగ్ సందర్భంగా పలనాడు జిల్లాలో పోలీసులు భారీ పహారా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డిఎస్పీల మఖాం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. ఈ కౌంటింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, ఈసీ కఠిన ఆదేశాలతో మరింత అప్రమత్తమయ్యారు పలనాడు పోలీసులు. పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది 144 సెక్షన్. ఈ రోజు నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు వాణిజ్య వ్యాపార కలాపాలు పూర్తిగా బంద్ కానున్నాయి. ఈ కౌంటింగ్ సమయంలో చిన్నపాటి ఘర్షణలకు పాల్పడినా , రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.