ఏపీ ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు పడింది. సోమవారం శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు ఉత్తర్వులు జారీ చేసారు. లోకేశ్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న రఘురాజు తెరచాటు, వెన్నుపోటు రాజకీయా గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీతో కుమ్మకై ఎస్.కోటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి.


ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి డ్రామా ఆడారు. ఈ క్రమంలో తాజాగా రఘురాజుపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news