తెలంగాణలో 8 స్థానాల్లో కాంగ్రెస్ విజయదుందుభి

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ విధంగానే ప్రభావం చూపింది. ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పక్కా అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 17 స్థానాలకు గానూ 8 స్థానాల్లో విజయకేతం ఎగురవేసింది. ఖమ్మంలో నామ నాగేశ్వరరావు (బీఆర్​ఎస్​)పై రఘురాం రెడ్డి (కాంగ్రెస్‌) విజయం సాధించగా, వరంగల్‌లో ఆరూరి రమేశ్‌ (బీజేపీ)పై కడియం కావ్య (కాంగ్రెస్‌) విజయం సాధించారు.

నల్గొండలో సైదిరెడ్డి (బీజేపీ)పై కుందూరు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్‌) గెలవగా, మహబూబాబాద్​లో మాలోత్ కవిత (బీఆర్​ఎస్​)పై బలరాం నాయక్‌ (కాంగ్రెస్‌) గెలుపొందారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్​ షెట్కార్‌ విజయం సాధించారు. భువనగిరిలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్‌) 1.95 లక్షలకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. నాగర్‌ కర్నూల్‌లో 88 వేలకు పైగా ఆధిక్యంతో మల్లు రవి (కాంగ్రెస్‌), పెద్దపల్లిలో 1.31 లక్షలకు పైగా మెజార్టీతో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్‌) విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news