వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటమి తట్టుకోలేక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ అనే వాలంటీర్.. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కాగా తన సొంత ఇలాకా గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఘోర ఓటమి చవి చూశారు. టీడీపీ క్యాండిడేట్ రాము 51 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించి.. పదేళ్ల తర్వాత గుడివాడలో టీడీపీ జెండాను రెపరెపలాడించాడు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై వైసీపీలో మరే నేత కూడా చేయనన్ని విమర్శలు కొడాలి నాని చేస్తుంటారు.
https://x.com/TeluguScribe/status/1798022836227031366