ఆ ఉగ్రవాదుల వద్ద భారీగా డబ్బు.. తల నరికినా సరే ! మళ్ళీ బలపడుతున్నారు…!

-

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడు మళ్ళీ బలపడుతోంది. ఎక్కడైతే తమ పట్టు కోల్పోయారో అక్కడే పాగా వేయడానికి సరికొత్త నాయకత్వంలో వాళ్ళు అడుగులు వేయడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. రెండు నెలల క్రితం ఇస్లామిక్ స్టేట్ అధినేతగా ఉన్న అబూబకర్ అల్ బగ్దాదిని అమెరికా బలగాలు కాల్చి చంపాయి. ఆ తర్వాత వాళ్ళు కొత్త నాయకుడిని ఎన్నుకున్నారు. ఇక అక్కడి నుంచి తమకు గతంలో పట్టున్న ఇరాక్, సిరియాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నాలు ఇస్లామిక్ స్టేట్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన కుర్దిష్ ఉగ్రవాద నిరోధక బృందానికి చెందిన ఒక అధికారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఉగ్రవాదులు ఇప్పుడు అల్-ఖైదా కంటే ఎక్కువ నైపుణ్యం మరియు ప్రమాదకరమైనవారని కుర్దిష్ ఉగ్రవాద నిరోధక అధికారి లాహూర్ తలబానీ మీడియాతో అన్నారు. “వారు మంచి పద్ధతులు, వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఇంకా వాళ్ల వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉందని ఆయన వివరించారు. అందుకే వారు వాహనాలు, ఆయుధాలు, ఆహార సామాగ్రి మరియు ఇతర సామగ్రిని కొనగలుగుతున్నారని, సాంకేతికంగా వారు ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారని. వారి వ్యూహాలను ఇప్పుడు బయటకు తీయడం చాలా కష్టం. అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక వాళ్ళు ఇప్పుడు అల్-ఖైదాలో వారి పూర్వీకుల మాదిరిగానే హామ్రిన్ పర్వతాలలోని గుహల్లోకి వెళ్లారని, పర్వత ప్రాంతాల నుంచి వారి కార్యాకలాపాలను కొనసాగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పెష్మెర్గా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, సిరియా నుండి సరిహద్దు దాటిన సుమారు 100 మంది ఉగ్రవాదులు ఇరాక్ లో మళ్ళీ బలపడటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news