కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ గా సోనియా గాంధీ

-

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఎంపీలు సోనియా గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీపీ ఛైర్పర్సన్గా ఆమె పేరుతో పాటు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, సుదర్శన్ పేర్లను నేతలు ప్రతిపాదించారు. ఈ క్రమంలో నేతలంతా సోనియావైపు మొగ్గుచూపారు.

ఇదిలా ఉంటే… ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకొని భంగపడ్డ మోదీ నాయకత్వ హక్కును కోల్పోయారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఫల్యానికి బాధ్యత వహించాల్సింది పోయి, రేపు ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారని సోనియా గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రదర్శన పేలవంగా ఉన్న రాష్ట్రాల్లో మెరుగవ్వడంపై తాము దృష్టి పెడుతామని తెలిపారు.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఇది కొత్త అవకాశమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news