ఐప్యాక్ ఓ పనికిమాలిన సంస్థ: మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ

-

వాలంటీర్ వ్యవస్థ, ఐప్యాక్ వైసీపీ ఓటమికి కారణాలయ్యాయని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లను నమ్మి వైఎస్ జగన్ కార్య కర్తలు, ఎమ్మెల్యేలకు సైతం సముచిత స్థానం కల్పించలేదు అని అన్నారు. ఐప్యాక్ పనికిమాలిన సంస్థ. అందులో రాజకీయాలకు పనికిరాని డిగ్రీలు చదివిన వారు తమ పబ్బం గడుపుకున్నారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్న వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని నివేదికలు పంపారు’ అని కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాగా, వైఎస్ జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది

Read more RELATED
Recommended to you

Latest news