ఉద్ధవ్ ఠాక్రేకు షాక్.. శిందే వర్గానికి టచ్లో ఇద్దరు శివసేన యూబీటీ ఎంపీలు

-

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు ప్రధాని, కేంద్ర మంత్రి వర్గం ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే శివసేన ఉద్ధవ్‌ వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు తమకు టచ్‌లో ఉన్నారంటూ శిందే వర్గం ప్రకటించడం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయాన్ని థానే నుంచి విజయం సాధించిన ఆ వర్గం ఎంపీ నరేష్ మ్హస్కే వెల్లడించారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఎంపీలు వస్తే.. అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో.. ఆరుగురు ఎంపీలతో కలిసి ఎన్‌డీఏలో చేరేందుకు యత్నిస్తున్నారని నరేష్ అన్నారు.

‘‘ఇద్దరు ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు. ఉద్ధవ్‌ వర్గం ఓట్లు అడిగిన తీరుపై వారు అసంతృప్తి చెందారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు భావించారు. కానీ, అది జరగలేదు. వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కోరుకుంటున్నారు. అందుకే ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు’’ అని నరేష్‌ తెలిపారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో శిందే వర్గం మొత్తం ఏడు ఎంపీ సీట్లను గెలుచుకొంది. మరో వైపు ఉద్ధవ్‌ వర్గం మాత్రం తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news