తెలంగాణ బీజేపీ ఎంపీలను అభినందించిన తమిళి సై

-

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఊహించని ఫలితాలను తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను ఎనిమిది స్థానాలలో బిజెపి విజయం ఈ క్రమంలో బిజెపి మెజారిటీ సీట్లు గెలవడంపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్పందించారు.తెలంగాణలో గెలుపొందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అభినందించారు.

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఈ ఎంపీల బృందం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో రెండు వారాల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని వీరి విజయంలో పాలుపంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేసి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అయితే చెన్నై సౌత్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి తమిళిసై ఓడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news