తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు వైసీపీ ప్రభుత్వ బాధితులను సైతం కొత్త ప్రభుత్వం ఆహ్వానించింది.వైఎస్ జగన్ ప్రభుత్వ బాధితుల కోసం ప్రత్యేక గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఆహ్వానం అందినవారిలో అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం సహా మొత్తం 104 కుటుంబాలు ఉన్నాయి.
కాగా, వైఎస్ జగన్ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది