వర్షాలపై మంత్రి సీతక్క సమీక్ష.. ముందస్తు చర్యలపై చర్చ

-

రానున్న వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై స‌చివాల‌యంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముంద‌స్తు చర్యలు అధికారులతో చర్చించారు. ప్రత్యేక అధికారుల పాల‌న‌లో గ్రామాలు ఉన్నందున ముంద‌స్తుగా స‌మ‌స్యల‌ను గుర్తించి వాటిని ప‌రిష్కరించేందుకు చ‌ర్యలు తీసుకోవాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్లు, పాత కనెక్షన్లపై సమీక్షించిన మంత్రి సీతక్క పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

T

కుంట‌లు, చెరువులు, డ్యాంలు, రిజ‌ర్వాయ‌ర్లకు వ‌స్తున్న వ‌ర‌ద‌పై అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వ‌ర్షాల‌ వ‌ల్ల పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటితో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అవ‌స‌ర‌మైన చోట తీసుకోవాల్సిన త‌క్షణ చ‌ర్యల‌పై అధికారుల‌ను ఆదేశించారు. అధికారులు ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులను ప‌ర్యవేక్షించాలని, తాగు నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news