తెలంగాణ మందుబాబులకు రిలీఫ్..బీర్యాని, హంటర్‌లకు తాత్కాలిక బ్రేక్!

-

తెలంగాణ మందుబాబులకు రిలీఫ్..బీర్యాని, హంటర్‌లకు తాత్కాలిక బ్రేక్ పడిందని సమాచారం. తీవ్రమైన వ్యతిరేకత నేపథ్యంలో బీర్యాని, హంటర్‌లకు తాత్కాలిక బ్రేక్ పడిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల 5 కొత్త మద్యం బ్రాండ్ల ద్వారా 27 కొత్త బీర్లకు అనుమతులు ఇవ్వగా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడి వాటి అనుమతులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

A temporary break for biryani and hunters in the face of fierce opposition

ఇటీవల కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ కొత్త కంపెనీలు 27 రకాల బీర్లను ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే ఆ ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా పర్మిషన్లకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news