ఏపీ స్టేట్ గెస్ట్ గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవికు ఆహ్వానం అందింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ ప్రయాణం కానున్నారు మెగాస్టార్ చిరంజీవి.
అటు ఏపీ స్టేట్ గెస్ట్ గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా వెళ్లనున్నారు. కాగా, చంద్రబాబును సభా నాయకుడిగా ఎన్నుకుంది తెలుగుదేశం-జనసేన-బీజేపీ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా… నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రివ ఎన్నిక అయ్యారు.ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా… నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రివ ఎన్నిక అయినట్లు పేర్కొన్నారు.