ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో… జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు… బిజెపికి ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు.
అంతేకాకుండా 17 మంది కొత్త వారికి మంత్రి పదవులు ఈసారి రానున్నాయి.
అయితే, ఏపీ సీఎం ప్రమాణస్వీకారానికి మీడియా, జర్నలిస్టులకు కొత్త ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షి మీడియాతో పాటు మరో రెండు ఛానళ్లకు అనుమతి నిరాకరించింది.