లోక్​సభ పోరులో ప్రియాంక పోటీ చేసుంటే మోదీ ఓడేవారు : రాహుల్ గాంధీ

-

తన సోదరి, కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఓడిపోయేవారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. తనను గెలిపించినందుకు గానూ రాహుల్‌ రాయ్‌బరేలీలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలాన్ని తగ్గించడానికి ఇండియా కూటమి పక్షాలన్నీ ఐక్యంగా పోరాడాయని తెలిపారు. అయోధ్య ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అయోధ్య, వారణాసితో పాటు పాటు దేశ ప్రజలు ఓట్లతో మోదీకి ఒక సందేశాన్ని ఇచ్చారని వ్యాఖ్యానించారు.

“అయోధ్య స్థానంలో బీజేపీ ఓటమి పాలైంది. రామమందిరం నిర్మించారు. మందిర ప్రారంభోత్సవంలో ఒక్క పేదవాడిని కూడా చూడలేదు. రైతు, కార్మికుడు, వెనుకబడిన వర్గం వారు, దళితుడు గానీ లేరు. ఆదివాసి అయిన రాష్ట్రపతికీ రావద్దని చెప్పారు. అదానీ, అంబానీలు వెళ్లారు. మొత్తం బాలీవుడ్‌ వెళ్లింది. క్రికెటర్లు వెళ్లారు. అందుకే అయోధ్య ప్రజలు ఇందుకు సమాధానం ఇచ్చారు. అయోధ్యలోనే కాదు. వారణాసిలో కూడా మోదీ ప్రాణం దక్కించుకున్నారు. నా సోదరి కనుక వారణాసిలో పోటీ చేసి ఉంటే 2 నుంచి 3 లక్షల ఓట్ల తేడాతో ప్రధాని అక్కడ ఓడిపోయేవారని నేను ప్రియాంకకు చెప్పాను. భారత ప్రధానికి.. భారత ప్రజలు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి రాజకీయాలకు, విద్వేషాలకు తాము వ్యతిరేకమన్న సందేశం ఇచ్చారు.” అని రాహుల్ గాంధీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news