ఏపీ మంత్రిగా రెండోసారి నారా లోకేశ్ ప్రమాణం

-

ఏపీ మంత్రిగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గత చంద్రబాబు హయాంలో లోకేశ్ ఐటీ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కేబినెట్​లో చోటు దక్కించుకున్న ఆయన ఇవాళ ప్రమాణం చేశారు. లోకేశ్ ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ సంతోషంగా చప్పట్లు కొట్టారు.  అయితే ఆయనకు ఏ శాఖ కేటాయించనున్నారో మాత్రం ఇంకా తెలియదు.

మరోవైపు అంతకుముందు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయతో ప్రమాణం చేయించారు. లోకేశ్ తర్వాత అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర , నాదెండ్ల మనోహర్‌, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌, నిమ్మల రామానాయుడు, ఫరూక్‌ వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, రామ్మోహన్‌నాయుడు, చిరాగ్‌ పాసవాన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్‌ దంపతులు, రామ్‌చరణ్‌ తదితరులు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news