బుల్లెట్ సౌండ్​తోనే నిద్రలేచా.. కాల్పుల ఘటనపై సల్మాన్‌ ఖాన్‌ వాంగ్మూలం

-

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం ఇటీవల తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసులు ఘటనకు సంబంధించి సల్మాన్​ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ రోజు తాను ఇంట్లోనే ఉన్నానని, బుల్లెట్ల శబ్దంతోనే నిద్రలేచానని సల్మాన్‌ ఖాన్‌ పోలీసులకు తెలిపారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం జూన్‌ 4న క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం సల్మాన్‌ నివాసానికి వెళ్లినట్లు ఓ అధికారి తెలిపారు. నటుడితో పాటు అతడి సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసుకున్నారు.

‘‘ఘటన జరిగిన రోజు (ఏప్రిల్‌ 14) నేను ఇంట్లోనే ఉన్నా. ముందు రోజు రాత్రి పార్టీ వల్ల ఆలస్యం కావడంతో లేట్‌గా పడుకున్నా. తెల్లవారుజామున నా ఇంటి బాల్కనీ వద్ద తుపాకీ పేలిన శబ్దాలు వినిపించడంతో వెంటనే ఉలిక్కిపడి నిద్రలేచా. బాల్కనీకి వెళ్లి చూడగా బయట ఎవరూ కన్పించలేదు’’ అని సల్మాన్‌ వాంగ్మూలంలో వెల్లడించారు. ఇక, ఘటన జరిగిన రోజు జుహూలోని తన నివాసంలో ఉన్నట్లు నటుడి సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ పోలీసులకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news